అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో

Updated on: Sep 08, 2025 | 6:55 AM

జపాన్లో 80 ఏళ్ల వృద్ధురాలు ఒక వ్యక్తితో ఆన్‌లైన్‌లో పరిచయం అయింది. తాను వ్యోమగామి అంటూ సరదాగా మాట కలిపాడు. అసలే ఒంటరి బతుకు వెళ్లదీస్తున్న ఆ వృద్ధురాలు తక్కువ కాలంలోనే అతడితో ప్రేమలో పడిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అతడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూడకుండా మాట్లాడకుండా అసలే ఉండలేక పోతున్నాను అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. అవన్నీ నమ్మిన వృద్ధురాలు అదంతా నిజమైన ప్రేమే అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాతే అసలు కథ మొదలైంది.

తాను అంతరిక్షంలో చిక్కుకుపోయాడని భూమికి తిరిగి రావడానికి అవసరమైన డబ్బు విమానం చార్జీలు చివరికి ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బు లేదని ఆరు లక్షల రూపాయలు కావాలని చెప్పాడు. అది విన్న మహిళ కరిగిపోయింది. వెంటనే అతడి ఖాతాలో అడిగిన మొత్తం జమ చేసింది. డబ్బులు అందినప్పటి నుంచి సదరు వ్యక్తి వృద్ధురాలిని పట్టించుకోవడం మానేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఆమె నంబర్‌ను బ్లాక్ చేసి పారేశాడు. దాంతో ఆమె మోసపోయాడని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళను మోసం చేయడానికి కేటుగాడు ఉపయోగించిన ఫోటోలు అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని వెనక ఒక వ్యక్తే ఉండి ఉండడని ఒక పెద్ద అంతర్జాతీయ ముఠానే ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత వరకు త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఆన్‌లైన్లో పరిచయమైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడదని వారు చెప్పే మాటలు నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. జపాన్‌లో వృద్ధుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. చాలా వరకు వీరు ఒంటరిగా ఉండటంతో కేటుగాళ్లు వీరినే టార్గెట్ చేస్తున్నారు. ఒంటరితనం పోగొడతామంటూ మాట కలుపుతున్నారు. పెన్షన్ ఇప్పిస్తామని హాస్పిటల్లో ఉన్న వారికి డబ్బులు కట్టాలని మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్న కేసులు జపాన్లో తక్కువేమి కాదు.

మరిన్ని వీడియోల కోసం :

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు వీడియో

రైల్లో ప్రయాణిస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు..అంతలోనే వీడియో

షాకింగ్‌ ఘటన.. అప్పుడే పుట్టిన శిశువును చూసి వైద్యులు షాక్‌ వీడియో

కాలిన శరీరం..అయినా కొడుకు పుస్తకాలను చదివి… లా కాలేజ్‌లో సీటు పొంది వీడియో