ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు

Updated on: Dec 12, 2025 | 6:03 PM

ఒంగోలులో ఓ కుటుంబం వందేళ్ల వేప చెట్టును తొలగించకుండా ఇంటిని దాని చుట్టూ నిర్మించింది. మూడు అంతస్తుల భవనం మధ్యలో పెరిగే ఈ చెట్టు, ఇంటికి పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది. పూర్వీకుల నుంచి పూజిస్తున్న ఈ చెట్టును తమ ఇంటి వేల్పుగా భావిస్తూ, ప్రకృతి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఇది గ్రహదోషాలను నివారిస్తుందని నమ్ముతారు.

సాధారణంగా ఇంటి డాబాపైన చిన్న చిన్న మొక్కలు కుండీల్లో పెంచుకుంటారు. కొందరు మహా వృక్షాలను బోన్సాయ్‌ చెట్లుగా పెంచుకుంటారు. కానీ ఓ వ్యక్తి తన ఇంటి ఆరవణలో కొన్నేళ్లుగా పెరుగుతున్న వేప చెట్టును తొలగించడం ఇష్టం లేక ఆ చెట్టును తన ఇంట్లో ఓ భాగంగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అంతేకాదు నిత్యం ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలులో జరిగింది. ఇంటి ఆవరణలో వేపచెట్టును పెంచడం వల్ల స్వఛ్ఛమైన గాలిని అందించడమే కాకుండా గ్రహ దోషాలను నివారిస్తుందని నమ్ముతారు. అలాంటి వేపచెట్టును ఇంటిని నిర్మించేందుకు తొలగించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే ఒంగోలులోని జమ్మిచెట్టు వీధిలో ఓ కుటుంబం ఇల్లు కట్టేందుకు స్థలంలో అడ్డుగా ఉన్న వేపచెట్టును కూల్చకుండా చెట్టు చుట్టూ ఇల్లు కట్టి దాన్ని సంరక్షించి పూజలు చేస్తున్నారు. వందేళ్ళుగా ఆ చెట్టు అక్కడ ఉందని, తమ పూర్వీకుల కాలం నుంచి ఆ చెట్టును పూజిస్తున్నారని ఆ ఇంటి యజమాని తెలిపారు. దాంతో చెట్టును తొలగించడం ఇష్టంలేక ఆ చెట్టుకు ఎలాంటి హానీ కలగకుండా.. స్వేచ్ఛగా పెరిగేలా ఏర్పాటు చేస్తూ ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి మధ్యలో చెట్టు వచ్చేలా మూడంతస్తుల భవనం నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ చెట్టు మూడంతస్తులు దాటి పెరగడంతో ఆ ఇంటికి పచ్చదనంతో పాటు గొడుగుపట్టినట్టుగా అందరినీ ఆకట్టుకుంటోంది. నగరానికి చెందిన రామచంద్రరావుకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో వేపచెట్టు చుట్టు ఇంటిని నిర్మించారు. కింద నుంచి పైకి ఎదిగిన చెట్టు మూడంతస్తులపై గొడుగులా నీడను ఇస్తోంది. వందేళ్లకు పైగా వయస్సు ఉన్న ఈ వేపచెట్టును తమ ఇంటి వేల్పుగా భావించి ఆ కుటుంబం పూజలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajinikanth: రజినీకాంత్‌ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్ర చేజార్చుకున్న ఐశ్వర్యారాయ్‌

మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్

వాహనదారులకు అలర్ట్‌.. ఇలాంటివారికి నో పెట్రోల్‌

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

వాతావరణశాఖ అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త