జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..

Updated on: Sep 04, 2025 | 8:23 PM

వర్షాలు, వరదలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువనుంచి కొట్టుకొస్తున్న వరదతో పాటుగా అరుదైన చేపలూ వస్తున్నాయి. పులసలు, పెద్ద పెద్ద పండుగప్పలు యానాం వద్ద వశిష్ట నదిలో దొరికితే.. ఇప్పుడు వయ్యారి వెండిచేప కూడా వచ్చింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఒనక ఢిల్లీ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం జలాశయంలో కనువిందు చేసింది ఈ వెండిచేప.

ఇటీవల ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసాయి. జలాశయాల నుంచి భారీగా వరదనీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్తు కేంద్రం దిగువన గిరిజనులకు పెద్దపెద్ద చేపలు దొరుకుతున్నాయి. అందులో ఓ గిరిజన జాలరి వలకి మిల మిల మెరిసే వెండి చేపచిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కిలోల బరువున్న ఆ చేపను తీసుకొని ఎంతో ఉత్సాహంగా మార్కెట్‌కు తరలించాడు ఆ జాలరి. భారీ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వేలంలో ఈ చేప భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఈ వెండి చేప శాస్త్రీయ నామం సిల్వర్ కార్ప్ ఫిష్. ఈ చేప సమశీతోష్ణ పరిస్థితులలో 6 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో నివసించే మంచినీటి జాతికి చెందినది. ఇవి నెమ్మదిగా ప్రవహించే లేదా స్థిరంగా ఉండే నీటిలో పెరుగుతాయి. ఇవి పెద్ద నదుల నుంచి వేరుపడిన నిల్వ ఉండే సరస్సుల లాంటి వాటిలో, బ్యాక్ వాటర్‌లో కనిపిస్తుంది. ఈ చేపలో ఔషధగుణాలు ఎక్కువగానే ఉంటాయి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. పాలిసాచ్యురేటెడ్ యాసిడ్స్ ఈ చేపలో లభిస్తాయని మత్స్య శాఖ అధికారులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు

మేడ్‌ ఇన్‌ ఇండియా సెమీ కండక్టర్‌ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్‌ ఆవిష్కరణ

కదిలిన ‘స్టార్ ఆఫ్ ది సీస్.. సముద్రంలో తేలుతూ తొలి ప్రయాణం!

బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం

72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌