ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

Updated on: Apr 22, 2025 | 5:50 PM

ఈ రోజుల్లో వైద్య ఖర్చులు సామాన్యులు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. భవిష్యత్‌లో మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన ఓ వైద్యురాలు పేద ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే అందించడానికి నడుం కట్టారు. తను పొదుపు చేసుకున్న డబ్బునే పెట్టుబడిగా పెట్టి ఓ డెంటల్‌ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

ఆమే.. ఒడిశా సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ శిఖా రామచందాని. తన భర్త గత నాలుగేళ్లుగా కేవలం ఒక్క రూపాయి ఫీజు తీసుకుని పేదలకు వైద్య చికిత్స అందిస్తున్నారనీ ఆయనే తనకు స్ఫూర్తి అని ఆమె అన్నారు. పేదల సేవకు మనల్ని మనం అంకితం చేసుకోవాలనేది తమ దివంగత అత్తగారి కల కూడా అని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే తను ఈ వైద్యశాలను ప్రారంభించానని శిఖా రామచందాని అన్నారు. డాక్టర్‌ శిఖా బుర్లాలోని విమ్సార్‌ వైద్య కళాశాల సమీపంలో, తన అధికారిక నివాసంలోనే దంత వైద్యశాలను ప్రారంభించారు. అక్కడ కేవలం ఒక్కరూపాయికే పేదలకు దంత వైద్యం చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ క్లీనిక్‌లో మొదటి పేషెంట్‌గా లహండా గ్రామానికి చెందిన రవీంద్ర సేథ్‌ చేరారు. ఆయన డెంటల్ స్కేలింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దంత చికిత్స చాలా ఖరీదైనదిగా మారిపోయిందనీ కానీ తనకు ఇక్కడ కేవలం ఒక్క రూపాయికి చికిత్స చేశారనీ ఈ దంపతులను తప్పక అభినందించాల్సిందే అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

Samantha: సమంత షాకింగ్‌ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు