Bogatha Waterfall: భారీ వర్షాలు.. పరవళ్లు తొక్కుతోన్న బొగత.. వీడియో
బొగతా జలపాతం ఉప్పొంగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతానికి భారీగా వరద నీరు వస్తోంది. అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహిస్తోంది. ప్రమాదం పొంచి ఉండడంతో సందర్శకులను అనుమతించడం లేదు అధికారులు.
తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు ఉరకలెత్తుతున్నాయి. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది.
ములుగు జిల్లా బొగత జలపాతాలకు వరద పోటెత్తింది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలతో బొగత జలపాతాలకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు ఆంక్షలు విధించారు. బోగత జలపాతాల వద్దకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…