విషాదం..కొన్ని గంటల్లో తాళి కట్టాల్సిన వరుడు.. అంతలోనే వీడియో

Updated on: Nov 13, 2025 | 2:01 PM

నిజామాబాద్ జిల్లా, మంగళ్‌పహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవంబర్ 16న పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు చేవూరి ప్రతాప్ గౌడ్ గ్రామ శివారులోని గుట్టపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు, ఈ ఘటనతో రోదనలతో దద్దరిల్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. నవంబర్ 16వ తేదీన వివాహం చేసుకోబోతున్న చేవూరి ప్రతాప్ గౌడ్ (22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ప్రతాప్, గ్రామ శివారులోని గుట్టపై ఉరివేసుకుని కనిపించాడు. ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో, అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళ్‌పహాడ్ గ్రామానికి చెందిన నారాయణ గౌడ్ చిన్న కుమారుడైన ప్రతాప్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు అతనికి ఇటీవల పెళ్లి నిశ్చయించారు. నవంబర్ 13న పెళ్లి జరగాల్సి ఉండగా, అంతకు ముందు రోజు సోమవారం సాయంత్రం నుంచి ప్రతాప్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో గాలించగా, మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో అతడి బైక్ కనపడటంతో, అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు.

మరిన్ని వీడియోల కోసం :

మరో స్పెషల్‌ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో

మాట జారాను.. మన్నించండి వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో