మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత విడాకులు పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్‌గా పార్టీ ఇస్తోంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది.
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత విడాకులు పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్‌గా పార్టీ ఇస్తోంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యంగా వివాహ మాల నిమజ్జనం, మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఎన్జీవో సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భాయ్ వెల్ఫేర్ సొసైటీ పెళ్లైన మగవాళ్లపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతుంది. అయితే ఈ సంస్థ చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటాల ద్వారా 18 మంది మగవాళ్లకు విడాకులు వచ్చాయి. దాంతో వారి విడాకులపై సంస్థ వేడుక నిర్వహిస్తుంది. దీనికోసం “విడాకుల ఆహ్వానం” అనే పేరుతో ఓ ఇన్విటేషన్ కూడా ప్రింట్ చేయించింది. ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరగనుంది. గత రెండున్నరేళ్లలో 18 మంది మగవాళ్లు తమ జీవితాన్ని దుర్భరం చేసిన వివాహం నుంచి విముక్తి పొందారు. హెల్ప్‌లైన్ ద్వారా అలాంటి వారు మానసికంగా స్థిరంగా ఉండేందుకు చేయూతనిచ్చేందుకే ఈ ఈవెంట్ చేస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్