కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

Updated on: Aug 05, 2026 | 7:24 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల అక్రమ విక్రయాలకు సంబంధించిన రెండు ఘటనలను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో నాలుగు రోజుల పసికందును, విజయవాడలో మూడు రోజుల శిశువును విక్రయించే ప్రయత్నాలను అడ్డుకుని చిన్నారులను రక్షించారు. ఈ కేసుల్లో దళారులు, కొనుగోలుదారులను అరెస్ట్ చేసి, శిశువులను చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణకు అప్పగించారు.

అంగట్లో సరుకులా ముక్కుపచ్చలారని పసికందులను అమ్మేస్తున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలతో తల్లిదండ్రులను లోబరుచుకుంటూ పురిట్లోనే శిశువులను విక్రయిస్తున్నారు. తాజాగా ఒకే రోజు అటు ఏపీ, ఇటు తెలంగాణలలో ఇద్దరు నవజాత శిశువులను పోలీసులు రెస్క్యూ చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఘటనలపై అధికారులు దాడులు చేస్తున్నా, ఈ దందా ఆగడంలేదు. పహాడీషరీఫ్ ప్రాంతంలో 4 రోజుల ఆడబిడ్డను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టారు. రియాసత్ నగర్‌కు చెందిన అఫ్రీన్ బేగం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో వహీదా ఖాతూన్ అనే దళారీ ఆమెకు మాయమాటలు చెప్పి బిడ్డను అమ్మేలా ఒప్పించింది. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సామాజిక కార్యకర్త సఫియా మాఫీ సహాయంతో కొనుగోలుదారుగా నటిస్తూ డబ్బుల లావాదేవీ సమయంలో నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తల్లిని, దళారీని అరెస్ట్ చేసి పసికందును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. అటు విజయవాడలోనూ 3 రోజుల ఆడశిశువు విక్రయ ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు. బిడ్డ కోసం ఏకంగా రూ. 6.59 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లో ఢిల్లీకి చెందిన ఒక ఐవిఎఫ్ సెంటర్ ఉద్యోగిని మధ్యవర్తిగా గుర్తించారు. ఈ కేసులో శిశువును కొనుగోలు చేసిన దంపతులతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పట్టుబడ్డ దళారీ.. వహీదా ఖాతూన్ గతంలోనూ పిల్లలను అమ్మారని ఆరోపించారు సామాజిక కార్యకర్త సఫియా మాఫీ. పిల్లల విక్రయాల్లో హాస్పిటల్ డాక్టర్ల పాత్ర కూడా ఉందని, చిన్నారుల అమ్మకం వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శిశువుల కొనుగోలు, అమ్మకం, మధ్యవర్తిత్వం వహించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌!

పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌!

కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!

త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!

Published on: Aug 05, 2026 07:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us