Watch: ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్ వీడియో..

|

Nov 19, 2024 | 6:11 PM

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో మావోరీ తెగకు చెందిన ఎంపీ మరోసారి సంచలనం సృష్టించింది. గత ఏడాది పార్లమెంట్‌లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తన గిరిజన కమ్యూనిటీ పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం ప్రకంపలను రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఇక, ఇప్పుడు మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.

ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేసింది. ఈ సందర్బంగా పార్లమెంట్‌లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా గత ఏడాది అక్టోబర్‌లో రికార్డు సృష్టించిన హన-రాహితి.. నానాయా మహుతా నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికైంది. ఆమె మావోరి తెగకు చెందిన గిరిజనుల కోసం పోరాడుతోంది. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణం నుంచి వచ్చింది. జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అయితే.. ప్రజల కోసం చనిపోతాననీ తాను రాజకీయ నాయకురాలిని కాదనీ తేల్చి చెప్పింది. కేవలం మావోరీ భాష సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.