పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.! వీడియో..

|

Dec 23, 2024 | 11:01 AM

పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఓ కిరాతక జంట ఏమాత్రం కనికరం లేకుండా పురిట్లోనే చంపేసింది. కర్నాటకలోని రామనగర పట్టణంలోని దయానంద సాగర్‌ ఆస్పత్రిలోని టాయిలెట్‌ కమోడ్‌లో నవజాత శిశువు మృతదేహం లభించిన కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఇది నేపాల్‌ జంట నిర్వాకమని పోలీసులు తేల్చారు. వారిని అరెస్టు చేశారు. నిందితులు అమృత కుమారి , సురేంద్ర మెహ్రా.

తాజాగా ఆస్పత్రిలోని టాయిలెట్‌ కమోడ్‌లో ఏదో అడ్డం పడిందని సిబ్బంది చెప్పడంతో పారిశుధ్య కార్మికులు యంత్రాలతో శుభ్రం చేశారు. ఈ సమయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం బయటకు వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా గుట్టు రట్టయింది. అమృత, సురేంద్రలు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ, సహ జీవనం సాగిస్తున్నారు. అమృత గర్భం దాల్చగా కడుపునొప్పిగా ఉందంటూ ఆ రోజున ఆస్పత్రికి వచ్చింది. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా శిశువును కమోడ్లో వేసి ఫ్లష్‌ చేసింది. తరువాత ఇద్దరూ వెళ్లిపోయారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.