నెల్లూరు ఫేమస్‌ స్వీట్‌.. తింటే వదిలిపెట్టరు

Updated on: Nov 24, 2025 | 5:28 PM

దక్షిణాఫ్రికాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని, పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయన మూడు రోజుల పర్యటన ముఖ్యాంశాలపై దక్షిణాఫ్రికా ప్రజలు సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు కురిపించారు. G20లో భారత్ నాయకత్వాన్ని, మోదీ చురుకైన పాత్రను కొనియాడారు. ఈ సమావేశం భారత్ పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని, దౌత్యపరమైన బలాన్ని చాటింది.

దక్షిణ భారతదేశంలో ఒక్కోప్రాంతానికీ ఒక్కో ఫేమస్‌ వంటకం ఉంటుంది. అది ఆప్రాంతంలో తయారైతేనే దాని రుచి పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అందుకే ఆ పదార్ధాలకు కూడా ఆ ఊరిపేరే స్థిరపడిపోతుంది. అలాంటిదే బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా ఇలా రకరకాల స్వీట్లు ఆ ఊరి పేర్లతోనే ఉంటాయి. అలాగే నెల్లూరు అనగానే చేపల పులుసు, బిర్యానీ గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ ఓ ప్రత్యేకమైన స్వీట్‌ కూడా తయారు చేస్తారు. అదే నెల్లూరు మలై కాజా. నెల్లూరు నగరంలో జైహింద్ స్వీట్ షాప్‌లో దొరికే ఈ మలై కాజాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. నెల్లూరులో తయారు చేసే మలై కాజా విదేశాలకు సైతం ఎగుమతి అవుతుందంటే అది ఎంత ఫేమస్సో అర్ధమవుతుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఇక్కడ జైహింద్ స్వీట్స్ ఏర్పాటు చేశారు. నగరంలోని ట్రంకు రోడ్లో చిన్న స్టాల్లో ఏర్పాటు చేసిన ఓ స్వీట్ దుకాణం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ దొరికే మలై కాజా అంత ఫేమస్ మరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి

అంతమంది జనం మధ్య సిగ్గు లేని పని చేశాడు.. ఆ తరువాత

ఆ స్టేషన్‌లో ఎయిర్‌పోర్టును మించిన లగ్జరీలు

ఈ సూపర్‌ మార్కెట్‌లో అన్నీ ఫ్రీనే

రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు