బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్‌ తిని వెళ్లారు! అసలేం జరిగింది?

Updated on: Jan 16, 2026 | 1:53 PM

నాగ్‌పూర్‌లో 103 ఏళ్ల గంగాబాయి సాఖరే మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఆమె మనవడు ఒక కదలికను గమనించాడు. ఊపిరి పీల్చుకోవడంతో బామ్మ బతికిందని నిర్ధారించారు. మరుసటి రోజు ఆమె పుట్టినరోజు కావడంతో, అంత్యక్రియల ఏర్పాట్లు కాస్తా పుట్టినరోజు వేడుకగా మారాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా రాంటెక్‌లో అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. 103 ఏళ్ల వృద్ధురాలు గంగాబాయి సాఖరే గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, గత కొద్ది రోజులుగా కేవలం రెండు స్పూన్ల నీటిని మాత్రమే తీసుకుంటూ జీవచ్ఛవంలా ఉంది. సోమవారం సాయంత్రం ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఈ వార్తను బంధువులందరికీ తెలియజేయడంతో, వారు అంత్యక్రియల కోసం తరలివచ్చారు. గ్రామస్తులు అంత్యక్రియల ఏర్పాట్లను ప్రారంభించి, స్మశానానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. సంప్రదాయం ప్రకారం, బామ్మకు స్నానం చేయించి, కొత్త బట్టలు ధరింపజేసి, అంత్యక్రియలకు సిద్ధం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?