Viral Video: ఇది గ్రాఫిక్‌ కాదండోయ్‌.. స్పైడర్‌ మ్యాన్‌లా రంగురంగులతో మెరిసిపోతున్న అగామా..(వీడియో)

Updated on: Jan 07, 2022 | 8:44 AM

సోషల్ మీడియాలో రోజూ రకరకాల వైరల్ కంటెంట్ సర్కులేట్ అవుతుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగాక కాస్త ఇంట్రస్టింగ్ ఉండేది ఏదైనా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలానే ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న జీవిని చూస్తే తొండలాగా ఉంది..


సోషల్ మీడియాలో రోజూ రకరకాల వైరల్ కంటెంట్ సర్కులేట్ అవుతుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగాక కాస్త ఇంట్రస్టింగ్ ఉండేది ఏదైనా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలానే ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న జీవిని చూస్తే తొండలాగా ఉంది.. పైగా అది ఎవరో పెయింట్‌ వేసినట్లు రెండు రంగులతో ఉంది. కానీ ఇదొక బల్లి జాతికి చెందిన జీవి. స్పైడర్‌మ్యాన్‌లా రంగురంగులతో కనిపించే ఈ అగామా బల్లి ఫోటో ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్స్ విభిన్న రకాల కామెంట్లు పెడుతున్నారు.స్పైడర్ మ్యాన్ లాగా కనిపించే బల్లిని మీలో చాలామంది అస్సలు చూసి ఉండరు. ప్రజంట్ అలాంటి బల్లి ఫోటో సోషల్ మీడియాలో మీ ముందుకు తీసుకొచ్చాం. అది స్పైడర్ మ్యాన్ లాగా కనిపిస్తుంది. సినిమాల్లో ఎరుపు, నీలం రంగుల్లో ఉండే స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఎలా ఉంటుందో, అలానే ఉంది ఈ బల్లి కూడా. ఈ బల్లి శరీరం సగం ఎరుపు రంగులో ఉంటుంది, మిగిలిన సగం నీలం రంగులో కనిపిస్తుంది. దాని ముందు కాళ్లు కూడా సగం ఎరుపు, సగం నీలం రంగులో ఉన్నాయి. ఈ ఫొటోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని మ్వాన్జా ఫ్లాట్-హెడ్ రాక్ అగామా, స్పైడర్ మాన్ అగామా అని పిలుస్తారని వివరించారు.

Published on: Jan 07, 2022 08:19 AM