రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ముంబై కోర్టు 50 ఏళ్ల నాటి ఒక చిన్న దొంగతనం కేసుపై సంచలన తీర్పు ఇచ్చింది. 1977లో జరిగిన రూ.7.65 పైసల చోరీ కేసులో నిందితులు, ఫిర్యాదుదారు దశాబ్దాలుగా అదృశ్యమవ్వడంతో ఈ కేసు పెండింగ్‌లో పడింది. పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా దీనిని చేపట్టిన న్యాయస్థానం, నిందితులపై అభియోగాలను కొట్టివేసి, రికవరీ మొత్తాన్ని ఫిర్యాదుదారుకు లేదా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఇది న్యాయవ్యవస్థలో ఒక ప్రత్యేక ఘట్టం.
50 ఏళ్ల క్రితం జరిగిన చిన్న చోరీ కేసుపై ఇప్పటికి తీర్పు వెలువడింది. ఐదు దశాబ్దాలుగా సాగుతున్న ఈ చోరీకేసుకు ముంబై కోర్టు మెజిస్ట్రేట్ తెరదించారు. 1977 నాటి ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడు చాలా ఏళ్లుగా అదృశ్యమయ్యారు. పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేస్తున్న ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కేసు ఏంటంటే.. దక్షిణ ముంబైలోని మజగావ్ న్యాయస్థానం పాత కేసులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 1977 నుంచి పెండింగులో ఉన్న రూ.7.65’పై చోరీ కేసు బయటపడింది. అప్పట్లో ఇది పెద్ద మొత్తమనే చెప్పవచ్చు. అయితే, ఇందులో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అనేకమార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయినప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ఫిర్యాదుదారుడుకూడా కనిపించకుండా పోయాడు. దీంతో ఈ కేసు దశాబ్దాలుగా మరుగునపడిపోయింది. యాభై ఏళ్లుగా ఎలాంటి పురుగతీ లేని ఈ కేసును ఇంకా పెండింగ్‌లో ఉంచడంలో అర్ధంలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా నిందితులపై ఉన్న అభియోగాలను కొట్టివేసిన న్యాయస్థానం.. రికవరీ చేసిన మొత్తం రూ.7.65 పై ను ఫిర్యాదుదారుకు అప్పగించాలని, ఒక వేళ ఆయన ఆచూకీ లభ్యం కాకపోతే ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
గ్రీన్‌లాండ్ కు సైనిక బలగాల తరలింపు
Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్
