వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ సంచలనం సృష్టించింది. ఓ నగల దుకాణంలోకి వెళ్లి, చాకచక్యంగా 2 కిలోలకు పైగా వెండి ఆభరణాలు చోరీ చేసింది. షాపు వర్కర్‌ను తెలివిగా Ablaze పెట్టి, నగలను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ మాయలేడీల ముఠా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. . ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు చూసి షాప్ యజమాని షాక్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఇద్దరు మహిళలు బంగారు ఆభరణాల కోసం వచ్చి ఖరీదు చేస్తున్నట్లు నటించారు. ఆ తర్వాత మరో నలుగురు మహిళలు వచ్చి షాపులో వర్కర్ ను కన్ఫ్యూజ్ చేశారు. చాలా అర్జంట్‌గా వెళ్లాలని, తొందరగా వెండి పట్టీలు చూపించాలని తొందరపెట్టారు. అతను పట్టీల ట్రే తీసి చూపిస్తున్న క్రమంలోనే వారిలో కొందరు వెండి నగలున్న ఓ బాక్స్ కొట్టేసి కామ్ గా అక్కడి నుంచి ఉడాయించారు. ఆ మహిళలు వెళ్లిపోయిన తర్వాత వెండి పట్టీల బాక్స్ ఒకటి కనిపించకపోవడంతో వర్కర్ కంగారు పడ్డాడు. ఆ మహిళలే ఎత్తుకెళ్లి ఉండొచ్చని గ్రహించాడు. వెంటనే వారి కోసం గాలించాడు. సీసీ కెమెరా పుటేజీ చెక్ చేయగా చోరీ దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. అది చూసి షాపు యజమాని షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ మాయలేడీల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ముఠా ఎక్కడికి పోయినా ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారని, గతంలో కూడా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారని వ్యాపారులు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
మీ గుడి మీద మైక్ లేదా ?? ఈ టీటీడీ ఆఫర్ మీకే
ఏవియేషన్ చరిత్రలో అద్భుతం.. ప్రకృతి థీమ్‌తో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్
Duvvada Srinivas: రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం
ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు