బురద మీద పడిందని ఇలా బుద్ధి చెప్పింది..

Updated on: Nov 04, 2025 | 8:49 PM

వర్షాకాలంలో మన పక్క నుంచి కారు వెళుతూ బురద మీద పడేసే సమస్య నడుస్తున్న ప్రతి ఒక్కరికి అనుభవమే. డ్రైవర్‌ను కసితీరా తిట్టుకుని, చివరకు నీళ్లతో కడుక్కుని సర్దుకుపోతుంటారు. ఇంతకుమించి ఎవరూ ఏం చేయరు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మీద బురద పడిందనే కోపంతో చివరకు ఆమె చేసిన పని.. అందరినీ షాకయ్యేలా చేస్తోంది. ఓ మహిళ రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తుంటుంది. రోడ్డు మొత్తం బురద బురదగా ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా నడుస్తుంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు వేగంగా దూసుకెళుతుంది. దాంతో రోడ్డు పక్కన ఉన్న బురద ఎగిరి మహిళపై పడింది. బురద మీద పడగానే షాకైన మహిళ.. ఆ కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న రాయి తీసుకుని కారుపై దాడి చేయాలని చూస్తుంది. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయినా ఆమె మాత్రం ఎలాగైనా కారు యజమానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని కారు తిరిగి వచ్చే వరకూ అక్కడే ఎదురు చూసింది. కాసేపటి తర్వాత ఆ కారు మళ్లీ అటుగా వచ్చింది. ఆమె రోడ్డు మధ్యలో రాయి పట్టుకుని నిలబడి ఉండడంతో వాహనాన్ని ఆపాల్సి వచ్చింది. కారును ఆపగానే దగ్గరికి వెళ్లిన ఆమె.. డ్రైవర్‌ను వాహనం నుంచి దింపి, రోడ్డు పక్కన కూర్చోబెడుతుంది. ఆ తర్వాత కారును ఆమె డ్రైవ్ చేసి అతనిపై బురద పడేలా చేస్తుంది. ఇలా రెండు మూడు సార్లు అటూ, ఇటూ వేగంగా నడిపి అతన్ని బురదతో నింపేస్తుంది. దీంతో ఆమె కోపం చల్లారుతుంది. ఇలా ఆమె ఆ కారు డ్రైవర్‌పై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోతుంది. అయితే ఇదంతా నవ్వుకోవడం కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.‘ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి’.. అంటూ కొందరు, ‘ఈ మహిళ చేసిన పని.. మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేలానికి బంగారు టాయిలెట్.. ధర ఎంతో తెలుసా

చేపల కోసం వలవేస్తే.. ఏం చిక్కాయో చూడండి

Rain Alert: ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు

40 ఏళ్లు దాటాక.. ఇవి తినాలంటున్న నిపుణులు

పండ్ల మీద స్టిక్కర్లు.. వాటిపై నంబర్లు.. దేనికి ??