మోమోస్ రుచి మరిగి.. తల్లి బంగారు నగలు ఇచ్చేసిన బాలుడు

Updated on: Feb 04, 2026 | 7:55 PM

ఏడో తరగతి చదువుతున్న ఆ బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ స్కూల్‌ కెళ్లేముందు దారిలో ఉన్న ఓ షాపులో అప్పుడప్పుడూ మోమోస్ తిని వెళ్లేవాడు. పిల్లాడికి మోమోస్ అంటే ఉన్న ఇష్టాన్ని గమనించిన మోమోస్ షాపులోని వ్యక్తులు ఓ పెద్ద స్కెచ్ వేశారు. ఇంట్లోని నగలు తెచ్చి తనకు ఇస్తే.. తిన్నన్ని మోమోస్ ఇస్తానంటూ చెప్పేవారు. అది విన్న బాలుడు ఏ మాత్రం ఆలోచించకుండా.. ఇంట్లోని బీరువాలో ఉన్న నగల్లో నుంచి ఎవరికీ తెలియకుండా.. రోజుకొకటి తెచ్చి షాపులోని వాళ్లకి ఇచ్చి.. పొట్టనిండా మోమోస్ తిని వచ్చేశాడు. ఇలా ఏకంగా రూ.85 లక్షల విలువ గల గోల్డ్ నగలను బాలుడు వ్యాపారికి ఇచ్చాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వారణాసిలో విమలేష్ మిశ్రా అనే పూజారి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు స్కూలులో చదువుతున్నాడు. ఆ బాలుడే .. తనకిష్టమైన స్నాక్‌ కోసం ఆ చిన్నారి ఏకంగా రూ. 85 లక్షల విలువైన కుటుంబ ఆభరణాలను వీధి వ్యాపారులకి అప్పగించాడు. బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ముగ్గురు వ్యాపారులు అతడిని మాయమాటల్లో పెట్టి భారీ దోపిడీ చేసారు. అయితే ఈ దారుణం చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సాగిపోయింది. కానీ ఇటీవలే విమలేష్ మిశ్రా సోదరి వచ్చి.. అన్నగారింట్లో దాచిపెట్టిన తన నగలను ఇవ్వమని అడగగా, అసలు సంగతి బయటపడింది.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us