రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

Updated on: Jul 15, 2026 | 8:42 PM

బీహార్‌లోని మాన్సి రైల్వే స్టేషన్‌లో జనహిత్ ఎక్స్‌ప్రెస్‌లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగను ప్రయాణికులు అప్రమత్తంగా పట్టుకున్నారు. రైలు కదలడంతో అతడు బయట వేలాడుతూ ఖగారియా వరకు సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. అనంతరం జీఆర్పీకి అప్పగించగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రైన్‌ ప్లాట్‌పారం మీదకు రాగానే ఎక్కే ప్రయాణికులు.. దిగే ప్రయాణికులతో హడావిడిగా ఉంటుంది. సందట్లో సడేమియా అన్నట్టుగా అదే సమయంలో దొంగలు కూడా తన పనిలో తాము మునిగిపోతారు. అలా ఓ దొంగ ట్రైన్‌లో చోరీకి యత్నించడంతో ప్రయాణికులు అతనికి చుక్కలు చూపించారు. బీహార్‌లోని బరౌని-కతిహార్ రైల్వే సెక్షన్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. జనహిత్ ఎక్స్‌ప్రెస్ ఖగారియా జిల్లాలోని మాన్సి స్టేషన్‌లో ఆగి ఉన్న సమయంలో మహ్మద్ ఫఖ్రుద్దీన్ అనే దొంగ.. రైలు లోపల ఉన్న ప్రయాణికుడి మొబైల్ ను కిటికీ గుండా కొట్టేయడానికి ప్రయత్నించాడు. ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అతడి చేయి గట్టిగా పట్టుకున్నారు. ఇంతలోనే రైలు కదిలిపోయింది. దీంతో దొంగకు ప్రాణభయం పట్టుకుంది. రైలు ఆగదు.. వాళ్లు చేయి వదలరు.. రైలును వదిలేయలేక.. తన చేయిని విడిపించుకోలేక ఆ దొంగ పడిన నరక యాతన వర్ణనాతీతం. వేగంగా దూసుకెళ్తున్న రైలుకి అలాగే పట్టుకొని వేలాడుతూ ఉండిపోయాడు దొంగ. మాన్సి స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ అయిన ఖగారియా వరకు సుమారు 15 కిలోమీటర్ల పాటు ప్రయాణికులు అతడి చేయిని వదలకుండా అలాగే పట్టుకున్నారు. మార్గమధ్యంలో ఆ దొంగ సహచరులు అతడిని విడిపించేందుకు ప్రయత్నించినా ప్రయాణికులు ససేమిరా అన్నారు. చివరకు ఖగారియా స్టేషన్ రాగానే రైల్వే పోలీసులకు దొంగను అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికుల అప్రమత్తతను పోలీసులు అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!

అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో

Follow Us