ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

Updated on: Dec 26, 2025 | 5:20 PM

ఆరేళ్ల బాలుడు తన కుటుంబం ప్రాణాలు కాపాడాడటం జరిగింది. దైవదర్శనానికి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బాలుడు చేసిన ఒక్క పనితో ఎనిమిదిమంది సజీవ దహనం కాకుండా ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి కారులో ఆరేళ్ల బాలుడు సహా ఎనిమిది మంది దేవుని దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో బాలుడు
బహిర్భూమికి వస్తోంది కారు ఆపాలని బాలుడు పేరెంట్స్‌కి చెప్పాడు. వారు వెంటనే డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పడంతో డ్రైవర్‌ కారు పక్కకు ఆపాడు. కొద్దీ సేపటికి కారులో నుంచి పొగలు రావటాన్ని గమనించాడు డ్రైవర్. వెంటనే కార్ లో ఉన్న వారిని అప్రమత్తం చేసి కిందికి దింపాడు. మరుక్షణంలో మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం కార్ మంటల్లో కాలిపోయింది. అర్పెందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. కానీ, మంటలు అదుపులో కి రాలేదు. కారుమొత్తం క్షణాల్లో బూడిదైపోయింది. అది చుసిన ప్రయాణికులు భయం తో వణికిపోయారు. బాహి ర్బుమి కోసం బాలుడు కారు ఆపి ఉండకపోయి ఉంటే ఏం జరిగేదో అని అంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబం సభ్యులను వేరే వాహనం లో ఇంటికి పంపారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో