డెలివరీకి వెళ్తుండగా.. రైల్లోనే ప్రసవం.. ఆ తర్వాత

Updated on: Nov 07, 2025 | 4:55 PM

ఇటీవల కాలంలో విమానాలు, రైళ్లు, బస్సులు ప్రసవ కేంద్రాలుగా మారిపోతున్నాయి. తోటి ప్రయాణికులు, సిబ్బంది వైద్యులుగా మారి ప్రసవాలు చేసిన అనేక ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా అలాంటి ఘటనే.. బెంగళూరు-భువనేశ్వర్‌ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. గర్భిణికి అనుకోకుండా నొప్పులు రావటంతో తోటి ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు.

ఇటీవల కాలంలో విమానాలు, రైళ్లు, బస్సులు ప్రసవ కేంద్రాలుగా మారిపోతున్నాయి. తోటి ప్రయాణికులు, సిబ్బంది వైద్యులుగా మారి ప్రసవాలు చేసిన అనేక ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా అలాంటి ఘటనే.. బెంగళూరు-భువనేశ్వర్‌ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. గర్భిణికి అనుకోకుండా నొప్పులు రావటంతో తోటి ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. ఝార్ఖండ్‌కు చెందిన సునిక ఛత్తర్‌ అనే గర్భిణి మంగళవారం తన భర్తతో కలిసి బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్‌కు బయలుదేరింది. ఈ దంపతులు అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కారు. మార్గమధ్యలో సునికకు నొప్పులు మొదలయ్యాయి. దాంతో సునిక భర్త కంగారు పడ్డారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు కొందరు ధైర్యం చేసి రైల్లోనే ప్రసవం చేయగా, సునిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది, పోలీసులు అనకాపల్లి స్టేషన్‌ సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో రైలు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకోగానే తల్లీబిడ్డలను 108 వాహనంలో అనకాపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, సునికకు ఏడో నెలలోనే కాన్పు అయిందని, ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు