అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!

Updated on: Oct 31, 2026 | 5:36 PM

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో మెటల్‌ డిటెక్టర్‌తో బంగారం కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి అరుదైన నిధి దొరికింది. టిబూబురా సమీపంలోని మౌంట్‌ స్టువర్ట్‌ స్టేషన్‌ వద్ద 1.2 కిలోల బంగారు గడ్డను గుర్తించాడు. పరీక్షల్లో అందులో 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌ విలువ 1.5 లక్షల నుంచి 1.6 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌ ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది. మెటల్ డిటెక్టర్ పట్టుకుని రోజూ భూమిని జల్లెడ పట్టే ఓ సాధారణ వ్యక్తిని రాత్రికి రాత్రే అదృష్టం వరించింది. టిబూబురా సమీపంలోని మౌంట్ స్టువర్ట్ స్టేషన్ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతున్న ఆ వ్యక్తికి ఏకంగా 1.2 కిలోల బరువున్న బంగారు గడ్డ దొరికింది. దీని మార్కెట్ విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ వ్యక్తి ఖనిజాల కోసం అన్వేషిస్తున్నాడు. అయితే ప్రతిసారీ అతనికి నిరాశే ఎదురయింది. కానీ ఈసారికూడా నిరాశ తప్పదనుకొంటున్న సమయంలో ఒక్కసారిగా ‘గోల్డ్ మాన్‌స్టర్ 2000’ మెటల్ డిటెక్టర్ నుంచి విభిన్నమైన శబ్దం వచ్చింది. అనుమానంతో కొద్దిగా మట్టిని తొలగించి చూసాడు. అతని కళ్లు జిగేల్‌మన్నాయి. అక్కడ మెరుస్తూ కనిపించిన బంగారు గడ్డను చేతుల్లోకి తీసుకొని మట్టిని పూర్తిగా శుభ్రం చేసి ఆనందంతో మురిసిపోయాడు. నిపుణులు ఈ బంగారు గడ్డను పరీక్షించారు. 1.2 కిలోల బరువున్న ఆ గడ్డలో 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 1,50,000 నుండి 1,60,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఈ అరుదైన నిధికి ‘టిబూబురా స్పౌడ్’ అని పేరు పెట్టారు. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారు గడ్డ దొరకడం అత్యంత అరుదని నిపుణులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఈ బంగారాన్ని పురాతన వస్తువులను సేకరించేవారికి విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెయిటర్‌‌పై చేయి చేసుకున్న గెస్ట్‌.. తాజ్ హోటల్‌ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా!

వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.1500కే ఏడాది ఫాస్టాగ్ పాస్.. టోల్ ప్లాజా బాదుడుకు చెక్

త్వరలో కొత్తగా రూ.1,000 నోటు? అధికారుల క్లారిటీ

వినియోగదారులకు వొడాఫోన్‌ ఐడియా షాక్‌.. భారీగా పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఛార్జీలు

Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి

Loading...
Unable to load recommendations.
Follow Us