డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి

|

Oct 01, 2023 | 9:17 PM

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మహిళా హాస్టల్‌లో గురువారం మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్‌ మీటర్లు ఉన్న ప్రాంతం నుంచి ఆ మంటలు వచ్చాయి. అక్కడ పాత ఫర్నీచర్, ఇతర సామాన్లు ఉన్నాయి. అక్కడ మొదలైన మంటలు.. తర్వాత పైఅంతస్తులకు ఎగబాకాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. 20 ఫైరింజన్లను పంపింది. కానీ ట్రాఫిక్ అంతరాయాల వల్ల ఎనిమిది మాత్రమే అక్కడకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించారు.

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మహిళా హాస్టల్‌లో గురువారం మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్‌ మీటర్లు ఉన్న ప్రాంతం నుంచి ఆ మంటలు వచ్చాయి. అక్కడ పాత ఫర్నీచర్, ఇతర సామాన్లు ఉన్నాయి. అక్కడ మొదలైన మంటలు.. తర్వాత పైఅంతస్తులకు ఎగబాకాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. 20 ఫైరింజన్లను పంపింది. కానీ ట్రాఫిక్ అంతరాయాల వల్ల ఎనిమిది మాత్రమే అక్కడకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించారు. లోపల ఉన్నవారిని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కలిసి లోపలివైపు నుంచి తాళం వేసి ఉన్న భవనం గేట్లు తెరిచారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి వారు కూడా హాస్టల్‌లోని మహిళలను కాపాడారు. మంటలు ఎగిసిపడుతున్నా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకున్నా వారు డేరింగ్‌గా ముందుకెళ్లారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన నుంచి 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. ముఖర్జీ నగర్.. ఢిల్లీ యూనివర్సిటీకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ పేయింగ్‌ గెస్ట్‌ హాస్టల్స్‌, కోచింగ్‌ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రస్తుతం హాస్టల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..

‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి

దారుణం.. నటి అర్చన గౌతమ్‌ పై దాడి

అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్‌ టైగర్ దేవర

సింపుల్ ఇంగ్లీష్‌.. సలార్‌ రికార్డ్స్‌ ఇన్ హాలీవుడ్

 

Published on: Oct 01, 2023 09:17 PM