ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

Updated on: Jan 24, 2026 | 9:30 AM

ప్రపంచంలోనే అతిపెద్ద మంగంపేట బెరైటీస్ గనులు మరో రెండేళ్లలో కనుమరుగు కానున్నాయి. గత 5 దశాబ్దాలుగా భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ గనులు ఇకపై పనిచేయవు. వేల మందికి ఉపాధి కల్పించిన ఈ ప్రాంతం కాలగర్భంలో కలవనుంది. క్రూడ్ ఆయిల్ వెలికితీతలో కీలకమైన బెరైటీస్ నిల్వలు 5000 మెట్రిక్ టన్నులు మాత్రమే మిగిలాయి. పుల్లరిన్ పరిశోధన జరుగుతున్నా, బెరైటీస్ తవ్వకాలు ఆగిపోవడం స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ముగ్గు రాయి నిక్షేపాలు కలిగిన మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా… దాదాపు 5 దశాబ్దాల కాలం భారతదేశానికి బెరైటీస్ ఘనులలో వెన్ను దన్నుగా నిలిచిన ఈ ఘనుల ప్రాంతం మరో రెండేళ్లలో కనుమరుగైపోతుందా.. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించిన ఈ ప్రాంతం కాలగర్భంలో కలిసిపోనుందా అంటే అవుననే అనిపిస్తోంది. ప్రపంచంలోనే బెరైటీస్ అంటే గుర్తొచ్చేది ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో గల మంగంపేట మైన్స్ . ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఆ తరువాత అన్నమయ్య జిల్లాకు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో మంగపేట మైన్స్ ఉన్నాయి. అలాంటి మైన్స్ రానున్న కాలంలో కాలగర్భంలో కలిసిపోతున్నాయి . మరో రెండేళ్లు మాత్రమే ఇక్కడ ఈ నిక్షేపాలు దొరుకుతాయట. దాదాపు 52 సంవత్సరాలుగా ఇక్కడ బెరైటీస్ నిక్షేపాలను అందించిన ఈ ప్రాంతం రానున్న కాలంలో ఒక మైలురాయిగా మాత్రమే నిలవనుంది. క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను వెలికి తీసేటప్పుడు వాడే మిషనరీ ప్రెషర్ వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి ఈ బెరైటీస్ ను అధికంగా వాడుతారు. 1974 లో ప్రారంభమైన ఈ మైన్స్ మరో రెండేళ్ళు మాత్రమే ఉంటాయని ఇక్కడ మరో 5000 మెట్రిక్ టన్నులు మాత్రమే బెరైటీస్ తీయగలమని బెరైటీస్‌ ఘనుల సీఈవో గోపీనాథ్‌ తెలిపారు. ఇక్కడ ప్రస్తుం ఏడాదికి మూడువేల మెట్రిక్ టన్నులు బెరైటీస్‌ తీస్తున్నామని తెలిపారు. అయితే ఇక్కడ దొరికే పుల్లరిన్ నిక్షేపాల పరిశోధన మరియు దాని శుద్ది జరుగుతుందని ఆయన అన్నారు. మంగంపేట మైన్స్ లో బెరైటీస్ నిక్షేపాల తవ్వకాలు ఆగిపోయినా మరో పది నుంచి పదిహేనేళ్ళ వరకు సరిపోయేలా నిల్వలు ఉన్నాయని సిపీవో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే

Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌

Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది

మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు

Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో