సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!

Updated on: Mar 27, 2026 | 5:20 PM

మంచిర్యాల జిల్లాకు చెందిన తాల్లపల్లి పద్మ అనే మహిళా రైతును భూరికార్డుల్లో 'మరణించినట్లు' తప్పుగా నమోదు చేశారు. కుమారుడి రైతుబీమా దరఖాస్తులో జరిగిన పొరపాటు వల్ల ఆమె పేరు మార్చబడింది. దీంతో పద్మకు అందాల్సిన పీఎం కిసాన్, రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయి. తాను సజీవంగా ఉన్నానని నిరూపించుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ అన్యాయంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

‘చెట్టంత మనిషిని మీ ముందే నిలబడి మాట్లాడుతున్నా.. అయినా నేను చనిపోయానంటున్నారు. రికార్డుల్లో నన్ను చంపేసి, నా భూమిని, రైతుసాయాన్ని లాగేసుకున్నారు’… అంటూ ఒక మహిళా రైతు అధికారుల ముందు బోరున విలపించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వేమనపల్లి మండలం దస్నాపూర్‌కు చెందిన తాల్లపల్లి పద్మ అనే మహిళా రైతుకు సర్వే నంబర్ 98లో 25 గుంటల భూమి ఉంది. ఏడేళ్ల క్రితం భర్త మరణించడంతో ఆ భూమి ఆమె పేరిట విరాసత్ పట్టా అయ్యింది. అప్పటి నుండి ఆమెకు పీఎం కిసాన్, రైతుబంధు సాయం అందుతోంది. అయితే, ఏడాది కాలంగా ప్రభుత్వ సాయం నిలిచిపోవడంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. రికార్డుల్లో ఆమె ‘మరణించినట్లు’ ఉండటంతో షాక్‌కు గురైంది. గత ఏడాది ఏప్రిల్ 11న పద్మ కుమారుడు రాకేష్ గౌడ్ తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. కుమారుడి పేరు మీద ఉన్న భూమికి రైతుబీమా పొందేందుకు ఏఈవోను సంప్రదించగా, అక్కడ దారుణమైన పొరపాటు జరిగింది. చనిపోయిన కుమారుడి పేరుకు బదులుగా, తల్లి పద్మ పేరును మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆధారాలు కావాలంటూ అధికారులు తిప్పించుకోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో, వెంటనే విచారణ జరిపి పద్మకు న్యాయం చేయాలని ఎంపీడీవో, ఏఈవోలను ఆదేశించినట్టు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..

రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా

కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు

రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు

RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??

Follow Us