Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్‌ఫోన్‌ లేని రోజుని ఊహించలేకపోతున్నారు.

Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి
Phone Using While Eating

Updated on: May 25, 2021 | 5:37 PM

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్‌ఫోన్‌ లేని రోజుని ఊహించలేకపోతున్నారు. కామన్ మ్యాన్ నుంచి కాస్ట్లీ పర్సన్ వరకూ ప్రతిఒక్కరి ఫస్ట్ ఛాయిస్ మొబైల్. అయితే, అతిగా మొబైల్‌ వాడుతున్న ఓ వ్యక్తికి అతడి భార్య ఊహించని షాక్‌ ఇచ్చింది.

ఇదిగో ఈ వ్యక్తిని చూశారుగా.. తిండి తింటునే సెల్‌ఫోన్ చూస్తున్నాడు..తినటం కంటే..మొబైల్‌ పైనే ఎక్కువ శ్రద్ద పెట్టాడు. అది గమనించిన అతడి భార్యకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చింది. వెంటనే ఓ ప్లాస్టర్‌ తీసుకొచ్చింది. అతడి ముఖానికి మొబైల్‌ఫోన్‌కి కలిసి బ్యాండెడ్‌ వేసేసింది.
దీంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

స్మార్ట్ ఫోన్ తో వచ్చిన చిక్కే ఇది. దాన్నే లోకంగా భావిస్తూ అందులోనే గంటల తరబడి సమయం గడుపుతుంటారు. నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నా, బంధువుల ఇంటికి వెళ్లినా, మన ఇంటికి బంధువులు వచ్చినా వారితో వెచ్చించే సమయం తక్కువే. ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్ పై చేతి వేళ్లు కదులుతూనే ఉంటాయి. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు సైతం దెబ్బతింటాయి. చూశారుగా మీకూ ఇలాంటి సీన్ ఎదురుకాకముందే..కాస్త అప్రమత్తంగా ఉండండి. కనీసం తినేటప్పుడైనా సెల్‌ఫోన్‌ పక్కనపెట్టండి.

Also Read: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి.. వివ‌రాలు

 ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి.. గురువారం డివిజన్ బెంచ్ విచారణ

Loading...
Unable to load recommendations.
Follow Us