నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!

|

Sep 01, 2022 | 9:04 AM

నిత్యం గొడవ పెడుతున్న భార్యతో విసిగి వేసారిపోయిన ఓ వ్యక్తి ఓ విచిత్రమైన పనిచేశాడు. భార్యతో పడలేక నెల రోజులుగా 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపై జీవనం సాగిస్తున్నాడు.

నిత్యం గొడవ పెడుతున్న భార్యతో విసిగి వేసారిపోయిన ఓ వ్యక్తి ఓ విచిత్రమైన పనిచేశాడు. భార్యతో పడలేక నెల రోజులుగా 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపై జీవనం సాగిస్తున్నాడు. వినడానికి వింతగా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లా కోపగంజ్‌లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన రామ్ ప్రవేశ్ అనే నలభై రెండేళ్ల వ్యక్తి భార్య ప్రవర్తనకు మనస్తాపం చెంది, గత నెల రోజులుగా తాటి చెట్టుపైనే ఉంటున్నాడు. భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఎంత సర్ది చెప్పినా కిందకు దిగి రావడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని అలా వదిలేయలేక.. చెట్టుపైకే ఆహారం అందిస్తున్నారు. కాగా రామ్‌ రాత్రిపూట చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రామ్‌ ఉంటున్న తాటి చెట్టు పక్కనే చాలా ఇళ్లు ఉన్నాయి. వారు తమ ఇళ్లలో ఏమి చేస్తున్నారో అతను గమనిస్తున్నాడని, ఇది తమ గోప్యతకు భంగం కలిగిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలువురు మహిళలు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ్‌ప్రవేశ్‌ను చెట్టు నుంచి కిందకు దిగాలని కోరారు. అందుకు అతను ససేమిరా అన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్

వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్‌

Published on: Sep 01, 2022 09:04 AM