Man – Bus: బస్సు మీద నుంచి వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డావ్‌.. నీ అదృష్టం బాగుంది డ్యూడ్..

ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసేస్తున్నాయి. తాజాగా ముంబయి మహా నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది.

Man - Bus: బస్సు మీద నుంచి వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డావ్‌.. నీ అదృష్టం బాగుంది డ్యూడ్..

|

Updated on: Dec 22, 2022 | 9:30 AM


ఈ వీడియో క్లిప్‌లో.. ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న బస్సు అతనిని ఢీ కొట్టి, అతని పై నుంచి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. బస్సు ఆపాలని కోరారు. దీంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అయితే బస్సుకింద పడిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అని భయపడిన జనం ఎంతో కంగారుగా పైకి లేపారు. అయితే బస్సు పై నుంచి వెళ్లినా అతనికి గాయాలు కూడా కాకపోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఏర్పుడుతున్న ట్రాఫిక్ జామ్ నగరవాసులకు కలవరపెడుతోంది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను 14 వేలమంది వీక్షించగా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. విపరీతంగా లైక్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Follow us