గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !

Updated on: Sep 02, 2025 | 12:56 PM

సాధారణంగా దొంగలు ఇళ్లు, గుడి, షాపులు అనే తేడా లేకుండా చోరీలు చేస్తుంటారు. అయితే ఛత్తీస్​‌ఘడ్‌లోని దుర్గ్‌కి చెందిన ఓ వ్యక్తి మాత్రం.. దేవుడిపై కోపంతో గుళ్లలోని హుండీలను టార్గెట్ చేసుకుని నగలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేస్తున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా.. దొంగతనాలకు పాల్పడుతున్న ఆ దొంగని . చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు.

యశ్వంత్ ఉపాధ్యాయ్ అనే దొంగ గత 15 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ ఎవరికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. ఓ దాడి కేసులో గతంలో యశ్వంత్ ఉపాధ్యాయ్ జైలుకు వెళ్లాడు. శిక్షాకాలంలో ఇతర ఖైదీల మూలంగా అతడికి హెచ్‌ఐవీ సోకింది. అయితే.. తనకు ఈ వైరస్ సోకడానికి దేవుడే కారకుడని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని యశ్వంత్‌ నమ్మడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే దేవుడి పై కోపం పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆలయాలలో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇప్పటివరకు, నిందితుడు 10 దేవాలయాలలో దొంగతనాలు చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దొంగతనానికి ముందు గుడి వద్ద రెక్కీ నిర్వహించి, వాహనాన్ని గుడికి దూరంలో పార్క్ చేసి కాలినడకను గుడికి వెళ్లి చోరీ చేసేవాడు. తర్వాత గుడిలోపలే.. బట్టలు మార్చుకుని ప్రధాన ద్వారం నుంచి గాక.. చిన్న ద్వారాల గుండా బయటపడేవాడు. విగ్రహం ముందుకి వెళ్లి నమస్కరించి.. నెమ్మదిగా జారుకునే వాడిననని నిందితుడు విచారణ వేళ వెల్లడించాడు. నిందితుడు హెచ్‌ఐవీకి చికిత్స తీసుకుంటున్నాడని పోలీస్‌ అధికారి సత్య ప్రకాశ్ తివారీ మీడియాకు తెలిపారు. ఈ కారణంగా అతడు దేవునిపై కోపం పెంచుకున్నాడని అన్నారు. అందుకే దేవాలయాలను మాత్రమే టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడని అన్నారు. దేవుడు తనకు ఇలాంటి నయంకాని వైరస్‌ను సోకేలా చేశాడని.. అతడు పదేపదే వాపోతున్నాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే

Vishal: పెళ్లికి ముందే సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్‌

Krish Jagarlamudi: ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన క్రిష్‌