టేస్టీ టేస్టీ డీజిల్‌తో ఆలూ పరోటా.. తిన్నారంటే..

|

May 15, 2024 | 8:32 PM

టేస్టీ టేస్టీ పరోటాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నూనెతోనే కాకుండా బట్టర్ లేదా నెయ్యి వేసి కాల్చి చేసిన పరోటాలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. అందులోనూ ఆలూ పరోటా అంటే చెప్పనక్కర్లేదు. కానీ చండీగఢ్ లోని ఓ చిన్నపాటి ధాబాలో డీజిల్ తో పరోటా చేస్తున్నాడు అక్కడి కుక్‌. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ దాబాలో పనిచేసే కుక్‌.. పిండిని వత్తి రొట్టెను చేశాడు.

టేస్టీ టేస్టీ పరోటాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నూనెతోనే కాకుండా బట్టర్ లేదా నెయ్యి వేసి కాల్చి చేసిన పరోటాలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. అందులోనూ ఆలూ పరోటా అంటే చెప్పనక్కర్లేదు. కానీ చండీగఢ్ లోని ఓ చిన్నపాటి ధాబాలో డీజిల్ తో పరోటా చేస్తున్నాడు అక్కడి కుక్‌. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ దాబాలో పనిచేసే కుక్‌.. పిండిని వత్తి రొట్టెను చేశాడు. అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల మిక్స్ ను ఉంచి, మెల్లగా వత్తి.. ఆలూ పరోటా తయారు చేశాడు. ఆతర్వాత దానిని పెనంపై వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు. ఇంత వరకూ బాగానే ఉంది. చివరిగా ఆ పరోటాపై డీజిల్ పోశాడు. అదేమిటంటే డీజిల్ మిక్స్ అని చెప్పాడు. ఇక ఆ పెనం నిండుగా డీజిల్‌ నింపాడు. అందులోనే ఆలూ పరాటాను బాగా కాల్చాడు. ఈ వీడియోను ఓ ఖాతాదారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది వీక్షించారు. కానీ, దీనిపై భిన్నమైన కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది తింటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె జబ్బులు పరార్

రాత్రుళ్లు అన్నం బదులు చపాతీలు తింటున్నారా ?? ఈ విషయాలు తెలుసుకోండి

బోను డోరు క్లోజ్‌ చేయడం ఎలాగో కుక్కకు నేర్పిన యజమాని.. ఆ తర్వాత

ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత

TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్