అమ్మో.. చేప కొరికితే ఇంత డేంజరా? ఏకంగా చెయ్యే తీసేశారు

Updated on: Jun 05, 2025 | 5:58 PM

కుక్కు కరిస్తే ఇంజెక్షన్ వేయించుకోవాలని అందరికి తెలిసిందే. మరీ చేప కొరికితే ఏం చేయాలి? దీనికి చాలా మంది ఇదో ప్రశ్నా అంటూ కొట్టిపారేస్తారు. అసలు చేప కొరికితే ఏం అవుతుంది, అదేమైనా ప్రమాదకరమైనా జంతువా అని లైట్ తీసుకుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఇంకెప్పుడూ ఇలా లైట్ తీసుకోరు.

ఎందుకంటే.. చేప కాటు కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన చేతినే కొల్పోయాడు? నమ్మడానికి ఆశ్చర్యకంగా ఉన్న ఇది నిజం. అసలు ఏం జరిగిందంటే.. కేరళలోని కన్నూరు జిల్లా థలస్సెరికి చెందిన 38 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ‘కడు’ అనే రకం చేప అతడి కుడి చేతివేలిని కొరకడం వల్ల అతడి కుడి చేతి వేలిపై చిన్న గాయమైంది. వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్నాడు. అయితే, ఎన్ని రోజులైనా గాయం మానకపోగా, నొప్పి ఎక్కువై అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో మరోమారు ఆసుపత్రికి వెళ్తే వైద్యులు రకరకాల పరీక్షలు చేసి ‘గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేల్చారు. ఈ ఇన్ఫెక్షన్‌ కణజాలాన్ని నాశనం చేసి ఆ ప్రాంతంలో వాయువును ఉత్పత్తి చేస్తుందట. ఇన్ఫెక్షన్‌ మెదడుకు చేరే ప్రమాదం ఉందని అందువల్ల ఆ చేతి భాగాన్ని తొలగించడమే పరిష్కారమని వైద్యులు చెప్పారు. దీంతో తొలుత చేతి వేళ్లను తొలగించారు. ఆ తర్వాత అరచేతిని పూర్తిగా తొలగించారు. ఇక ఇసుక, బురద నీటిలో కనిపించే క్లోస్ట్రడియం మయోనెక్రోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్​ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని ఈ సందర్భంగా వైద్యులు వివరించారు. కాగా, లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వివాహ వేడుకకు విశిష్ట అతిథి.. బంధుమిత్రులంతా పరుగో పరుగు

సర్పంచ్‌ కుర్చీని వదలనంటున్న శునకం.. చూసేందుకు క్యూ కడుతున్న జనం

షాపులో వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన ఓనర్‌కి షాకింగ్‌ సీన్‌

నేర చరిత్ర ఉన్న రిసార్ట్‌లో బస? హ‌నీమూన్ కోసం వెళ్లి.. అడ‌వుల్లో అదృశ్యం

రోజుకు 25 గంటలు..కాల గణనలో కొత్త పరిణామం..!