డెత్ సర్టిఫికెట్ పోయింది.. దొరికితే ఇచ్చేయండి.. వైరల్‌గా పేపర్ యాడ్
ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ సెప్టంబర్ 7 ఉదయం నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధృవీకరణ పత్రం పోగొట్టుకున్నట్లు పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశారు. ‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటన చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధృవీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? .. “ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు.ఎవరికైనా దొరికితే అతనికి ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యానికి కోపం వస్తుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇటీవల బతికున్న వారికి కూడా డెత్ సర్టిఫికెట్‌లు జారీ అవుతున్న ఘటనలు కోకొల్లలు. అధికారుల తప్పిదాలపై వ్యంగ్యంగా ఇచ్చిన పేపర్ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనిపించిన కాసేపటికే ఎలుగు మృతి !! మళ్లీ కనిపిస్తుందో లేదో ??
వీడి బైక్ స్టంట్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. చివరికి ఏమైందంటే ??
నీది మాములు తెలివికాదురోయ్.. చేపలు ఇలా కూడా పడతారా ??
సముద్రపు ఒడ్డున వాకింగ్ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్ !!
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో