కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
ఎంతో ఇష్టపడి, లక్షలు ఖర్చుచేసి కొనుక్కున్న కొత్తకారు రోజుల వ్యవధిలోనే పనిచేయకుండా పోతే ఎలాఉంటుంది? చిర్రెత్తుతుంది కదా.. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. లక్షలుపోసి కొన్న లగ్జరీ కారు కొన్ని రోజుల్లోనే మొరాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన
ఎంతో ఇష్టపడి, లక్షలు ఖర్చుచేసి కొనుక్కున్న కొత్తకారు రోజుల వ్యవధిలోనే పనిచేయకుండా పోతే ఎలాఉంటుంది? చిర్రెత్తుతుంది కదా.. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. లక్షలుపోసి కొన్న లగ్జరీ కారు కొన్ని రోజుల్లోనే మొరాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కారు యజమాని గాడిదలతో వీధుల్లో ఊరేగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ సుందర్‌వాస్ ప్రాంతానికి చెందిన శంకర్‌లాల్ అనే వ్యక్తి, మద్దిలోని రామ్‌జీ హ్యుందాయ్ షోరూమ్ నుంచి రెండు నెలల క్రితం 18 లక్షలతో హ్యుందాయ్ కారును కొన్నాడు. కారుకొన్న ఆనందం అతనికి ఎన్నోరోజులు నిలవలేదు. కొత్తకారులో ఫ్యామిలీతో షికారు చేయాలనుకున్న అతని ఆశలు అడియాశలయ్యాయి. కొద్ది రోజుల్లోనే కారులో సాంకేతిక సమస్య తలెత్తి.. కారు పనిచేయకుండా పోయింది. దీనిపై శంకర్‌లాల్ సర్వీస్ సెంటర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. బ్యాటరీ రన్ డౌన్ కారణంగా సమస్య తలెత్తిందని, కొద్ది సేపటికే మళ్లీ కారు స్టార్ట్ అవుతుందని సూచించారు. పదే పదే కారు ఆగిపోతుండటంతో షోరూం డీలర్‌ను సంప్రదించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??