కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా ఒరచందబిల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి కొత్త బైక్ కొనుక్కున్నాడు. ఉత్సాహంగా దానిపై రయ్.. రయ్ మంటూ ఇంటికి బయలుదేరాడు. సగం దూరం వెళ్లేసరికి బైక్‌లోనుంచి వింత వింత శబ్దాలు రావడం మొదలైంది. మొదట్లో తను అవేవీ పట్టించుకోలేదు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా ఒరచందబిల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి కొత్త బైక్ కొనుక్కున్నాడు. ఉత్సాహంగా దానిపై రయ్.. రయ్ మంటూ ఇంటికి బయలుదేరాడు. సగం దూరం వెళ్లేసరికి బైక్‌లోనుంచి వింత వింత శబ్దాలు రావడం మొదలైంది. మొదట్లో తను అవేవీ పట్టించుకోలేదు. బైక్ కొన్న ఆనందం హుషారుగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ శబ్దాలు అంతకంతకూ పెరుగుతుండటంతో.. అనుమానం వచ్చి, బైక్‌ని పక్కకి ఆపాడు. బైక్ మొత్తం పరిశీలించాడు. బైక్ హెడ్‌లైట్ బాక్స్ నుంచి ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అంతే అందులో కనిపించింది చూసి, దెబ్బకు బైక్ అక్కడే వదిలి పరుగందుకున్నాడు. బైక్ హెడ్‌లైట్‌లో ఏకంగా నాలుగు అడుగుల పాము కనిపించింది. భయంతో వణుకుతూనే స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టడానికి ఏకంగా రెండు గంటలు శ్రమించాడు. ఎట్టకేలకు పామును బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టడంతో బైకర్‌తో పాటు అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

