ప్రాణం తీసిన కోడిగుడ్డు.. నోట్లో పెట్టుకోగానే వీడియో
కోడిగుడ్డు ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. ఇదేంటి గుడ్డు ప్రాణం పోస్తుందికదా.. తీసేయడమేంటి అనుకుంటున్నారా? నిజమే.. గుడ్డును పొదిగితే పిల్ల వస్తుంది.. అదే గుడ్డు గొంతులో అడ్డుపడితే ప్రాణం పోతుంది. అదే జరిగింది తమిళనాడు కాంచీపురంలో. ఉడకబెట్టిన గుడ్డును అమాంతం మింగేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్ మలైయాంగుళం ప్రాంతానికి చెందిన రవి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేస్తున్నారు. భోజనానికి కూర్చున్న భర్తకు ఎగ్ కర్రీతో భోజనం వడ్డించింది. ఈ క్రమంలో రవి.. కంచంలోని గుడ్డును నోట్లో పెట్టుకున్నాడు. నమిలే లోగానే అది గొంతులోకి జారిపోవటంతో దానిని మింగే ప్రయత్నం చేశాడు. అయితే.. అది గొంతుకు అడ్డం పడటంతో నొప్పితో విలవిలలాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు.. దీంతో కుటుంబ సభ్యులు రవిని .. హుటాహుటిన పడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రవిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. రవి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :