ఈ చేపను ముట్టుకుంటే పక్షవాతం అది విషం చిమ్మితే మరణం

Updated on: Apr 26, 2025 | 8:39 AM

సముద్రంలో నివసించే జీవులు అనేక రకాలు. చేపలు, రొయ్యలు, పీతలను మనిషి ఆహారంగా తీసుకుంటే.. కొన్ని రకాల చేపలను అక్వేరియం లో పెట్టుకుని పెంపుడు జంతువులుగా మచ్చిక చేసుకుంటారు. సముద్రాల్లో ఉండే తిమింగలాల్లో కొన్ని చాలా డేంజర్. అవి మనిషిని చంపి తినేయగలవు. కానీ చేపలు హానికరం కాదని చాలా మంది అనుకుంటారు.

అయితే ఎర్రటి చారలతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఓ చేప మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఆపద ఎదురైతే.. వీపు మీదున్న ముళ్ల నుంచి విషం చిమ్మి తనను తాను రక్షించుకుంటుంది. దానిని సింహం చేప అంటారు. ఇవి తాజాగా యూకేలో వీలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. యూకేలో లయన్ ఫిష్ అనే చేపల గురించి ఇటీవల బాహ్య ప్రపంచానికి తెలిసింది. కలర్ ఫుల్ గా అందంగా కనిపించే ఈ చేపలు ఆరు అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. ఈ విషపు చేప చెసిల్ బీచ్ లో తన తండ్రితో కలిసి చేపలు పడుతున్న 39 ఏళ్ల వ్యక్తి గుర్తించాడు. దీన్ని లయన్ ఫిష్ అని పిలుస్తారు. అందంగా ఉన్నాయని ఎవరైనా వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. వారు ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే తమకు ఆపద వస్తున్నది అని భావిస్తే.. ఈ లయన్ ఫిష్ వెంటనే తమలోని విషాన్ని బయటకు చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చాట్‌జీపీటీ.. ఏ పుచ్చకాయ తియ్యగా ఉందో కాస్త చెప్పవా ??