తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో తాంత్రిక పూజల పేరుతో మహిళను లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి చికిత్స చేస్తామని నమ్మించి నిందితుడు మహిళను మోసగించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో మరిన్ని బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
టెక్నాలజీ యుగంలోనూ చాలామంది మూఢనమ్మకాలను వీడటం లేదు. వీరి బలహీనతను అవకాశంగా మలచుకొని కొందరు కేటుగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. ఆధ్యాత్మికత ముసుగులో కొందరు. తాంత్రిక పూజల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లా వసాయిలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేస్తామని నమ్మించి, ఒక మహిళపై తాంత్రిక పూజల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అర్నాలా కోస్టల్ పోలీసులు అజయ్ కమలాకర్ రౌత్ అనే నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు బాధితురాలిని వసాయి కోట వద్ద ఉన్న ఒక తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. కుమారుడి వ్యాధి నయం చేస్తామని చెప్పి పూజల పేరుతో ఆమెను లొంగదీసుకుని లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత అర్నాలాలోని ఒక రిసార్ట్‌లో కూడా తనపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిపై గతంలోనూ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఒక కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూజల నెపంతో ఇదే తరహాలో మరికొందరు మహిళలను కూడా మోసగించి, లైంగిక, ఆర్థిక వేధింపులకు గురిచేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!
