ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి

Updated on: Dec 31, 2025 | 8:23 PM

మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ నుండి ఓ పులి గ్రామంలోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. గోపాల్ కోల్ అనే వ్యక్తిపై దాడి చేసి, ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చుంది. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు 8 గంటలు శ్రమించి పులిని బంధించారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తరచుగా పులులు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఓ పులి హల్‌చల్‌ చేసింది. మామూలు హల్‌చల్‌ కాదు అది… ఇప్పటి వరకు ఏ పులి ఇలా చేసి ఉండదు. బంధవ్‌గఢ్‌ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో నుంచి ఓ పులి సమీపంలోని గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ మంచంపై కూర్చున్న గోపాల్‌ కోల్‌ అనే వ్యక్తికి పంచ్‌ ఇచ్చింది. ఆ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న దుర్గాప్రసాద్‌ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చుని దర్జా ఒలకబోసింది. పులిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఇంటి పైకప్పులు ఎక్కడివారు అక్కడ దాక్కున్నారు. ప్రస్తుతం.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. వెంటనే ఆ ఊరికి చేరుకున్నారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఊరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. గాయపడిన గోపాల్‌ను చికిత్స నిమిత్తం కాట్నీ జిల్లాలోని బర్హి ఆసుపత్రికి తరలించారు అటవీ శాఖ అధికారులు. ప్రస్తుతం.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. టైగర్‌ రిజర్వ్‌కు దగ్గరగా ఉండడంతో తమ గ్రామంలోకి తరచూ పులులు చొరబడుతుంటాయని.. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు వాపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలి గుప్పిట్లో తెలంగాణ.. నెల రోజులుగా వణుకే..

ATM: ఇక.. ఏటీఎంలు కనుమరుగేనా

ధోనీ కారులో అది చూసి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్

వీరు పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయనక్కర్లేదా ??

రన్నింగ్‌ ట్రైన్‌లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??