పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

Updated on: Oct 28, 2025 | 6:20 PM

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఓ యువతి పశువుల కోసం గడ్డిని కట్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆ యువతి ఊహించని విధంగా మృత్యువాత పడింది. యంత్రంతో గడ్డి కోస్తున్న ఆ యువతిని పాము కాటు వేసింది. అదికూడా గడ్డియంత్రంలో పడి ముక్కలైపోయిన పాము తల భాగం వచ్చి యువతిని కాటు వేసింది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా సబల్‌గఢ్‌ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో ఆదివారం భర్తి కుశ్వాహా అనే 18 ఏళ్ల యువతి పశువులకు దాణా కోసం గడ్డి యంత్రంతో గడ్డిని కోస్తోంది. ఆ గడ్డిలో అప్పటికే పాము చేరి ఉంది. దానిని గమనించని యువతి.. గడ్డితో కలిపి ఆ పామును కూడా కట్ అయ్యింది. అది మూడు ముక్కలైంది. గడ్డిలో రక్తం కనిపించడంతో షాకైన యువతి.. దానిని పరిశీలించగా అందులో పాము కనిపించింది. ఆమె తేరుకుని పక్కకెళ్లేలోపే ఊహించని విధంగా పాము తల భాగం వచ్చి యువతిని కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే యువతిని నాటువైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా

తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ

మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు