స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. యువకుడిని లింగమార్పిడి చేసి, అత్యాచారం చేసిన..దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఒబెదుల్లాగంజ్ ప్రాంతానికి చెందిన ఒక 27 ఏళ్ల యువకుడితో... అక్కడే ఉండే శుభమ్ యాదవ్ అనే వ్యక్తి స్నేహం చేశాడు. కొన్నాళ్లకు.. శుభమ్ యాదవ్ దుర్భుద్ధితో తన స్నేహితుడి రూపాన్నే మార్చేశాడు.
తలనొప్పికి ట్రీట్మెంట్ అంటూ తన స్నేహితుడికి స్త్రీ హార్మోన్ల ఇంజెక్షన్లు ఎక్కించాడు. కాగా, తన శరీరంలో వస్తున్న మార్పులు చూసి ఆ యువకుడు ఆందోళన చెందగా.. ఇండోర్ తీసుకెళ్లి రూ. 5 లక్షల ఖర్చుతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే యువకుడు కాస్తా మహిళగా మారిపోయాడు. సర్జరీ తర్వాత మహిళగా మారిన యువకుడిపై నర్మదాపురంలో శుభమ్ యాదవ్ లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత, తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకున్న బాధితుడు.. పోలీసులను ఆశ్రయించటంతో, శుభమ్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును నర్మదాపురం పీఎస్‌కు బదిలీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: