డ్రైవ్ చేస్తూ తినాలని ఉందా ?? అయితే ఈ డైనింగ్‌ టేబుల్‌ మీ కోసమే.. మీరు ఎక్కడికి వెళ్తే అది అక్కడికే !!

|

Jul 14, 2022 | 6:01 PM

మొబైల్ కాంటీన్ చూశాం.. ఫుడ్ ట్రక్ కూడా చూశాం.. కానీ మొబైల్‌ ఈటింగ్‌ ఎప్పుడైనా చూసారా... మొబైల్‌ ఈటింగ్‌ అంటే ఏదో రోడ్డు మీద నడుస్తూ వేరుశనక్కాయలు తినడం కాదండోయ్‌...

మొబైల్ కాంటీన్ చూశాం.. ఫుడ్ ట్రక్ కూడా చూశాం.. కానీ మొబైల్‌ ఈటింగ్‌ ఎప్పుడైనా చూసారా… మొబైల్‌ ఈటింగ్‌ అంటే ఏదో రోడ్డు మీద నడుస్తూ వేరుశనక్కాయలు తినడం కాదండోయ్‌… చక్కగా ఓ డైనింగ్‌ టేబులు, దాని చుట్టూ కంఫర్ట్‌బుల్‌గా చైర్లు కూడా ఉన్నాయి. దానిలో హాయిగా కూర్చుని ఇష్టమైన ఫుడ్‌ తింటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతున్నారు… ఇదెక్కడి గోలండి బాబు అనుకుంటున్నారా.. నిజమే.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ నలుగురు యువకులు ఓ డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుని ఫుట్‌ తింటున్నారు. ఇంతలో ఆ డైనింగ్ టేబుల్‌ రయ్‌మంటూ ఓ పెట్రోలు బంక్‌ దగ్గరకి దూసుకొచ్చింది. ఆ పెట్రోలు బంక్‌ అతను దాన్లో పెట్రోలు నింపాడు. మళ్లీ అది రయ్‌మంటూ దాని గమ్యం వైపు దూసుకుపోయింది. ఇంతకీ ఇదంతా ఎలా జరిగిందంటే.. చూడ్డానికి డైనింగ్‌ టేబుల్‌లా ఉన్న అదొక బండి. దానికి చక్రాలు.. ఇంజన్.. పెట్రోల్ టాంక్..అన్నీ ఉన్నాయి. దానిపైన కూర్చుని తింటూనే వాళ్లు దాన్ని కాళ్లతో హ్యాండిల్‌ చేస్తున్నట్లున్నారు. ఇంట్లో టిఫిన్‌ తినడానికి టైం లేక పాపం వాళ్లు ఇలా సెట్‌ చేసుకున్నట్టున్నారు.. ఏది ఏమైనా ఈ బండి తయారు చేసినవారికి హ్యాట్సాఫ్‌ అంటున్నారు నెటిజన్లు. ఏంటో మొబైల్‌ క్యాంటీన్‌ కాలం పోయి మొబైల్‌ ఈటింగ్‌ కాలం వచ్చిందంటున్నారు మరికొందరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!

ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్‌ అయ్యావో సీన్‌ సితారే..

రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!

Published on: Jul 14, 2022 06:01 PM