వేటకు వెళ్లి తప్పిపోయాడు.. మూత్రం తాగి, కీటకాలను తింటూ బతికిన యువకుడు.. చివరకు ??

Updated on: Mar 13, 2023 | 9:37 PM

ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి అడవిలో పురుగులను తిని మూత్రం తాగుతూ బతకాల్సి వచ్చింది. బొలీవియాకు చెందిన ఓ వ్యక్తి తాను అమెజాన్ అడవుల్లో ఒక నెలపాటు చిక్కుకుపోయాడు.

ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి అడవిలో పురుగులను తిని మూత్రం తాగుతూ బతకాల్సి వచ్చింది. బొలీవియాకు చెందిన ఓ వ్యక్తి తాను అమెజాన్ అడవుల్లో ఒక నెలపాటు చిక్కుకుపోయాడు. అక్కడ తనకు తినడానికి ఆహారం, తాగడానికి పానీయాలు లేకుండా పోయానని పేర్కొన్నాడు. దట్టమైన అమెజాన్ అడవుల నుంచి బయటపడడానికి మార్గం దొరకక నెల రోజుల పాటు తిరిగాడు. చివరికి రెస్క్యూ టీమ్ కంటబడి.. రక్షించబడ్డాడు. తిరిగి మానవజీవితంలో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తన కష్టాలను వివరించాడు.. అది వింటే.. ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఒక వార్తా నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల జొనాటన్ అకోస్టా తన స్నేహితులతో కలిసి జనవరి 25న ఉత్తర బొలీవియాలో వేట కోసం విహార యాత్రకు వెళ్ళాడు. అనుకోకుండా తన స్నేహితుల నుండి విడిపోయిన అకోస్టా అడవిలో తప్పిపోయాడు. తమ స్నేహితుడి కోసం స్నేహితులు వెదికారు. చివరకు అడవుల్లో అకోస్టా రెస్క్యూ టీమ్ కు చిక్కాడు. ఈ నెల రోజులు తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నానో అకోస్టా వివరించాడు. అడవిలో తనను తాను ఎలా బ్రతికించుకున్నాడో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రెండ్‌ మారింది గురూ.. పెళ్లి బరాత్‌ మామూలుగా లేదుగా..

పుట్టుకతో అబ్బాయి.. అమ్మాయిగా మారి .. పెళ్ళితో సెన్సేషన్‌

వలలో చిక్కి విలవిలలాడిన కాకి.. బాలుడు ఏంచేశాడంటే ??

ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా

 

Published on: Mar 13, 2023 09:37 PM