సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

Updated on: Dec 05, 2025 | 7:28 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. డబ్బు, చీరలు పంచడం, కోతులను పట్టించడం వంటివి సాధారణం. అయితే సిద్దిపేట జిల్లాలో ఒక వార్డు మెంబర్ అభ్యర్థి భర్త, తన భార్య గెలిస్తే ఐదేళ్లు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ హామీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రకరకాల హామీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల అన్ని పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కొంతమంది డబ్బు పంచడం,కొందరు చీరలు, వివిధ రకాల వస్తువులను బహుమతిగా అందిస్తున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు కొంతమంది ఊర్లో ఉన్న కోతులను పట్టడం.. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక (మం) రఘోత్తంపల్లి గ్రామంలో శివాని శ్రీకాంత్ అనే మహిళ గ్రామ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నారు. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే, ఆ వార్డులోని ప్రజలకు ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించారు ఆమె భర్త శ్రీనివాస్. ఇలా శ్రీనివాస్ ప్రకటించిన ఆఫర్ పై అందరూ పెద్ద ఎత్తున చర్చించు కుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!