Loading video

రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత.. క్లైమాక్స్ లో దిమ్మతిరిగే సీన్

|

Mar 21, 2025 | 7:38 PM

సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి. వయసుతో సంబంధం లేకుండా ఈ రీల్స్‌లో మునిగిపోతున్నారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం రీల్స్‌ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకునేవారు కొందరైతే.. నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయి ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు.

తాజాగా ఓ యువకుడు రాత్రి వేళ ఇంటిముందు ఆరుబయట మంచం వేసుకొని పడుకొని రీల్స్‌ చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మెల్లగా అక్కడికి చిరుత పులి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆరుబయట మంచం మీద పడుకొని రీల్స్‌లో మునిగిపోయాడు ఓ యువకుడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చందో కానీ నెమ్మదిగా నక్కి నక్కి అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది. రీల్స్‌లో మునిగిపోయిన అతను చిరుతను గమనించలేదు. అయితే ఆ చిరుత.. అతడి మంచం పక్కనే పడుకొని ఉన్న కుక్కను నోటకరుచుకొని వెళ్లిపోయింది. ఆ శబ్ధానికి ఈ లోకంలోకి వచ్చిన అతను ఏం జరిగిందా అని చుట్టుపక్కలా వెతికాడు. ఇంతలో ఆ చిరుత పులి నోటకరుచుకొని వెళ్లిపోయిన కుక్క.. దాని నుంచి తప్పించుకొని అక్కడికి పరుగు పరుగున వచ్చింది. అప్పుడు కనిపించింది అతనికి చిరుత. దెబ్బకు అక్కడినుంచి ఇంట్లోకి పరుగెత్తి తలుపు వేసేసుకున్నాడు. చిరుతను చూసిన కుక్క అరుస్తూనే ఉంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..

ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..

చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌

వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం