క్షణక్షణం..భయం భయం.. చేతబడులతో వణికిపోతున్న గ్రామం

Updated on: Sep 08, 2025 | 6:15 PM

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రంగరాయపురంలో చేతబడి ఘటనను స్థానికులు మరువక ముందే.. మరోసారి అదే గ్రామంలో అదే తరహా ఘటన జరగటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి ముందు ముగ్గులు వేసి, మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి, మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు, కుంకుమ వేసి క్షుద్ర పూజలు చేసిన తీరును చూసిన జనం భయంతో వణికిపోతున్నారు. ఈ మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ఆ గ్రామంలో ఓ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. కాగా, ముహూర్తానికి సరిగ్గా ఒకరోజు ముందు కొందరు దుండగులు.. ఇంటి ముందు నల్ల నువ్వులు పోసి పూజలు చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగటంతో చీకటి పడితే .. గ్రామస్తులు బయటకు రావటానికి భయపడుతున్నారు. ఎవరో చేతబడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు దీన్ని ఎవరో కావాలని చేస్తున్న దుశ్చర్యలని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనల పై పోలీసులు తక్షణమే నిఘా పెట్టి సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఈ పరిస్థితులు మరిన్ని ఉత్పన్నమై భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పనిమనిషి చేసిన పనికి సోషల్‌ మీడియా షేక్‌

ఇక.. ఇండియాలో ఇంద్రధనస్సు కనబడదా? వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు