వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి షాక్

Updated on: Nov 17, 2025 | 5:24 PM

కర్నూలు జిల్లా మహానందిలో స్నేక్ క్యాచర్ మోహన్ అద్భుత ప్రజ్ఞ కనబరిచారు. రైతు ఇంట్లో ప్రవేశించిన ఏడు అడుగుల కోడెనాగును, అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద కారులో ఉన్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రమాదకర పాములను సురక్షితంగా నల్లమల అడవిలో విడిచిపెట్టి, గ్రామస్థులకు, పోలీసులకు ఊరటనిచ్చారు. మోహన్ ధైర్యాన్ని, సేవను అందరూ ప్రశంసించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలోని రైతు మహానంది ఇంట్లోకి పాము చొరబడింది. బుధవారం మధ్యాహ్నం అరుదైన ఏడు అడుగుల పొడవైన కోడె నాగు బుసలు కొడుతూ కనిపించింది. దాంతో రైతు కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు గురైంది. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ ఘటనాస్థలికి చేరుకుని, కిచెన్ లోని గ్యాస్‌ సిలిండర్‌ పక్కన దాక్కున్న కోడె నాగును పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. కోడే నాగును పట్టుకోవడానికి ప్రయత్నిస్తూండగా స్నేక్‌ క్యాచర్‌పై ఎటాక్‌ చేయబోయింది. ఎంతో చాకచక్యంగా అరుదైన కోడేనాగును పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు మోహన్‌. దీంతో శ్రీనగర్ గ్రామస్థులు, రైతు మహానంది కుటుంబం ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన అదే రోజు రాత్రి మహానంది మండలం పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్‌కు గురైన కారులో కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువ సచారంపై పోలీసులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ కారు క్రింది భాగాంలో దాక్కున్న కొండచిలువను పట్టుకున్నాడు. స్నేక్ క్యాచర్ మోహన్ ప్రతిభను పొగుడుతూ చిన్నారులు చప్పట్లు కొట్టి అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన ఖర్మ బాగాలేకపోతే.. ఇంతేనేమో ??

వామ్మో…అక్కడికెలా వెళ్లావురా సామీ !!

EPF: పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్‌ ఒకటే !!