భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..

Edited By:

Updated on: Dec 12, 2025 | 7:13 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సబ్ ట్రెజరీ అధికారి రఘునందన్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన వెంటనే పైకప్పు కూలిపోయింది. బ్రిటీష్ కాలం నాటి ఈ శిథిలావస్థ భవనంలో పనిచేయడానికి ఉద్యోగులు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే మరమ్మతులు లేదా కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు.

ఆయుష్షు ఉండాలే కానీ వెంట్రుకవాసిలో పెను ప్రమాదాలనుంచి తప్పించుకొని బతికి బట్టకట్టవచ్చు అంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కర్నూలు జిల్లాలో. ఓ ప్రభుత్వ కార్యాలయం పైకప్పు కూలి పోయిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ క్యాబిన్ ల్లో ఒక్కసారిగా పై కప్పు ఊడి పడింది. ఆ సమయంలో ఓ ఫైల్ కోసం సబ్ ట్రెజరి ఆఫీసర్ రఘునందన్ ఏదో పనిమీద బయటకు వచ్చారు. ఆయన తన క్యాబిన్‌నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పెద్ద శబ్ధంతో పైకప్పు కూలిపోయింది. ఆ శబ్దం విని ఏం జరిగిందోనని కార్యాలయంలోని సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో రఘునందన్ స్పందిస్తూ.. ఈ కార్యాలయం బ్రిటిష్ కాలం నాడు నిర్మించిందని, భవనం శిథిలావస్థలో ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయం భయంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్డింగ్ మరమ్మతులు చేపట్టడం గాని నూతన భవనాన్ని నిర్మించడం గాని చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..

Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..

కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన

Published on: Dec 12, 2025 07:00 PM