వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రస్తుతం కాశీ ఆలయంలో పనిచేస్తున్న పూజారులకు, ఉద్యోగులకు నెలకు 30,000 రూపాయల జీతం అందుతుంది. ఇప్పుడు యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వారి వేతనాలు మూడు రెట్లు పెరగనున్నాయి. అంటే ఒక్కొక్కరికి నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం అందనుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత కాశీ ఆలయంలో భారీగా జీతాలు పెంచడం ఇదే తొలిసారి అని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఆలయ పరిపాలనను చేపట్టింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పూజారుల జీతాలపై ఇంత శ్రద్ధ పెట్టలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే దిశగా బిర్జాపూర్ ఆలయానికి ఉన్న 46 బిగాల భూమిలో వేద విద్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా కాశీలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కాశీ విశ్వనాథ దాం, శక్తిపీఠం, విశాలాక్షి మాత ఆలయం మధ్య ప్రత్యక్షంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడున్న భవనాలను కొనగోలు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం :
