అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు

Updated on: Mar 13, 2026 | 7:10 PM

కర్ణాటకలో ఓ అద్భుతం జరిగింది. కిడ్నీ సమస్యలతో మరణించాడని వైద్యులు ప్రకటించిన 65 ఏళ్ల ముబారక్ అవతిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటం ప్రారంభమైంది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ఆయన్ని తిరిగి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో శ్వాస మందగించి మరణించినట్లు అనిపించవచ్చని, సరైన నిర్ధారణ అవసరమని వైద్య నిపుణులు వివరించారు.

మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కర్నాటకలో ఓ అద్భుతం జరిగింది. బాగల్‌కోట జిల్లా జమఖండి పట్టణంలో ముబారక్‌ అవతి అనే 65 ఏళ్ల వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై నుంచి తొలగించి శ్వాస ఆగిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో అతనిలో కదలిక వచ్చింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస మందగించి వ్యక్తి మరణించినట్లు గా భావించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని వారు సూచించారు. ఈ ఘటన బాగల్‌కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు

జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

Loading...
Unable to load recommendations.
Follow Us