అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు

Updated on: Mar 31, 2026 | 4:21 PM

కాకినాడ జిల్లా కరపలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం అరుదైన అద్భుతం. ఈ దైవిక మహిమకు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారు సజీవంగా ఉన్నారని నమ్మిన భక్తులు భారీ ఊరేగింపుగా సేవలు సమర్పించారు. ఇది భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారి లీలగా ఆలయ ధర్మకర్త పేర్కొన్నారు.

ఆధ్యాత్మికతకు నిలయమైన కాకినాడ జిల్లా కరపలో ఒక అరుదైన, అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి ‘చెమటలు’ పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టాయని తెలియగానే.. సాక్షాత్తూ అమ్మవారు విగ్రహరూపంలో ఇక్కడ కొలువై ఉన్నారంటూ భక్తులు పూనకాలతో ఉగిపోయారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య సుమారు 5,000 మంది మహిళా భక్తులు భారీ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ‘సారె’ సమర్పించారు. పట్టుచీరలు, పండ్లు, పిండివంటలు, గాజులతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరప పురవీధులన్నీ వారాహి నామస్మరణతో మారుమోగిపోయాయి. కాశీపురాధీశ్వరి అయిన వారాహి అమ్మవారు, కాశీ తర్వాత, కరపలో కొలువయ్యారనడానికి ఈ సంఘటనే నిదర్శనమని, ఇక్కడ ఉన్నది అమ్మవారి విగ్రహం కాదని, శక్తివంతమైన అమ్మవారి ప్రతిరూపమని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం అనేది ఆమె ఇక్కడ సజీవంగా ఉన్నారనడానికి నిదర్శనమని, ఇది ఒక దైవిక అద్భుతమని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు వెల్లడించారు. భక్తుల కోర్కెలు తీర్చి, అందరినీ చల్లగా చూడటానికే అమ్మవారు ఇలాంటి మహిమలు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుతం చూసిన తర్వాత భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. ఈ మహిమను కళ్లారా చూసేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??

షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌

Loading...
Unable to load recommendations.
Follow Us