Iran: ఈ ఖాళీ కుర్చీ వెనుక ఓ ఆసక్తికర ఘటన !!
అమెరికా జర్నలిస్టు క్రిస్టినా అమన్‌పోర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసితో జరగాల్సిన ఇంటర్వ్యూ అర్ధాంతరంగా రద్దయింది. అమన్‌పోర్ తన తలకు స్కార్ఫ్ ధరించలేదని .
అమెరికా జర్నలిస్టు క్రిస్టినా అమన్‌పోర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసితో జరగాల్సిన ఇంటర్వ్యూ అర్ధాంతరంగా రద్దయింది. అమన్‌పోర్ తన తలకు స్కార్ఫ్ ధరించలేదని .. ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసి నిరాకరించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన రైసిని అమన్‌పోర్ ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా.. హెడ్‌స్కార్ఫ్ ధరించని మహిళతో ఇంటర్వ్యూ చేయలేమని రైసి ప్రతినిధి చెప్పినట్లు అమన్‌పోర్ వెల్లడించారు. ఇరాన్ బయట జరిగిన ఇంటర్వ్యూలకు గతంలో ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా ఇలాంటి నిబంధన విధించలేదని ఆమె గుర్తు చేశారు. తాము న్యూయార్క్‌లో ఉన్నామని, ఇక్కడ హెడ్‌స్కార్ఫ్ ధరించే సంప్రదాయం లేదని అమన్‌పోర్ తన ట్విట్టర్‌లో తెలిపారు. రైసి ఇంటర్వ్యూకు రాకపోవడంతో.. ఖాళీ కుర్చీ ముందు కూర్చున్న ఫోటోను అమన్‌పోర్ తన ట్వీట్‌లో పోస్టు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనిపించిన కాసేపటికే ఎలుగు మృతి !! మళ్లీ కనిపిస్తుందో లేదో ??
వీడి బైక్ స్టంట్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. చివరికి ఏమైందంటే ??
నీది మాములు తెలివికాదురోయ్.. చేపలు ఇలా కూడా పడతారా ??
సముద్రపు ఒడ్డున వాకింగ్ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్ !!
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో